సూర్యనమస్కారము -1

ప్రణామాసనం
1 వ స్థితి- ఆజ్ఞాచక్రమ

నిటారుగా నిలబడి రెండు పాదములు కలిసి ఉండాలి. చేతులు నమస్కారముద్రలో ఉండాలి. గాలి వదుల్తూ అరచేతుల్ని గట్టిగా ప్రెస్ చేయాలి. గాయత్రీ మంత్ర ఉచ్చారణ చేస్తూ శరీరము యొక్క ఎడమ భాగములో ఉన్న స్ప్లీన్ (సూర్య చక్రం) లోకి సూర్య కిరణాలు ప్రవేశిస్తున్నాయని భావించాలి. (సూర్యచక్రము ఎడమ వైపు ఉన్న ప్రక్కటేముకలకు సుమారు 1 అంగుళము క్రింద హృదయానికి సూటిగా ఉంటుంది) * సూర్య చక్రము నుంచి ఆజ్ఞాచక్రం వద్దకు “ఉదావసు" అనబడే బృహస్పతి గ్రహాన్ని నిర్మించే కిరణాలు స్కై బ్లూ కలర్ లో ప్రసరిస్తున్నాయని భావించు కోవాలి.
ఓం హ్రాం మిత్రాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ “పంచ కర్మేంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియా లను" సూర్యునికి సమర్పిస్తున్నాననే భావన చెయ్యాలి. అంతేకాక సృష్టిలోని అందరినీ మిత్రభావంతో చూచే మానసిక స్థితిని ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా మనస్సులు కలవని వ్యక్తులను తమకు 3 అడుగుల దూరంలో నిల్చుని ఉన్నట్లు భావనచేస్తూ ఆజ్ఞాచక్రము నుండి 'నీలి రంగు' కిరణాలతో వాళ్ళను ముంచుతున్నట్లుగా భావన చేయాలి.
సూర్యనమస్కారము -2

హస్త ఉత్థానాసనం
2 వ స్థితి - విశుద్ధి చక్రము

* గాలి పీలుస్తూ చేతుల్ని సమాంతరంగా పైకెత్తుతూ ఎంత వెనుకకు వంగగలరో అంతవరకూ వంగాలి. * స్ప్లీన్ నుండి శుక్ర గ్రహాన్ని నిర్మించే నీలి రంగు "విశ్వవ్యచ ” కిరణాలు విశుద్ధి చక్రము వద్దకు చేరు కుంటున్నాయని స్పష్టంగా భావించాలి. ఆకాశతత్త్వానికి అధిదేవత “భువనేశ్వరి” ని ‘హ్రీం' అనే బీజాక్షరంతో స్మరిస్తాం. అందువల్ల,

ఓం హ్రీం రవయే నమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -3

పాదహస్తాసనం
3 వ స్థితి - అనాహత చక్రము

*గాలి వదుల్తూ ముందుకు వంగి అరచేతుల్ని పాదాల ప్రక్కన నేలకు ఆన్చుతూ పాదహస్తాసనం స్థితికి రావాలి. మోకాళ్ళు వంగకూడదు. * సూర్యగ్రహాన్ని నిర్మించే తెల్లని సూర్య కిరణాలు అనాహత చక్రంలోకి ప్రవేశిస్తున్నట్లు భావించాలి. స్క్రీన్ నుంచి వచ్చే ఎఱ్ఱని తప్త కిరణాలు అనాహతానికి చేరి అక్కడ రక్తాన్ని శుద్ధి చేస్తున్న భావన చేయాలి. ఇవి స్ప్లీన్ నుంచే కాక బ్రహ్మరంధ్రం నుంచి కూడా ప్రవేశిస్తున్న భావన చేయాలి. “త్రిపురసుందరీ” స్వరూపంగా బ్రహ్మ రంధ్రం నుంచి ఈ కిరణ శక్తి అమృతధారను శరీరమంతటా పంపిస్తుంది.

ఓం హ్రుమ్ సూర్యాయనమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -4

అశ్వ సంచలనాసనం
4 వ స్థితి - మణిపూరక చక్రము

* గాలి పీలుస్తూ కుడికాలును వెనక్కి తీసికెళ్ళాలి. దృష్టి ముందుకు చూస్తూవుండాలి. * బుధగ్రహాన్ని నిర్మించే "విశ్వకర్మ" కిరణాలు ఆకు పచ్చని రంగులో స్ప్లీన్ నుంచి మణిపూరక చక్రాన్ని చేరుకుంటున్న భావన చేయాలి. ప్రకృతిలో ఈ కిరణాలు సమత్వాన్ని కలుగజేసి విషాలను బహిర్గతం చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్ కి సంబంధించిన ప్రోబ్లమ్స్ కి , నరాలకి సంబంధించిన ప్రోబ్లమ్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఓం హ్రైం భానవేనమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -5

దండాసనం

5 వ స్థితి - స్వాధిష్టాన చక్రము

* గాలి వదుల్తూ ఎడమకాలు వెనక్కు తీసుకెళ్ళి వాలు బల్ల పోజ్ లో నడుము వంగకుండా భూమికి 30° కోణంలో ఉండాలి. చంద్రగ్రహాన్ని నిర్మించే “సుషుమ్న” మరియు “సురాదన” అనే నారింజ రంగు శీతల కిరణాలు స్ప్లీన్ నుండి స్వాధిష్ఠాన చక్రంలోకి ప్రవేశిస్తున్న భావన. ఈ కిరణాలు వేడిని, వ్యాకోచాన్ని కలిగించి, ఉత్సాహాన్ని పెంచుతాయి. వీటి లక్షణం 'క్షారీయం'. లివర్, స్పీన్, కిడ్నీస్, ఇంటస్టైన్స్ ఈ రంగు ప్రభావం ఉంటుంది. కఫ సంబంధమైన బాధల్ని నివారిస్తుంది. నెత్తురులోని రక్తకణాల న్యూన్యతను తగ్గిస్తుంది. బరువు తగ్గిస్తుంది. బలహీనతను తగ్గిస్తుంది. పీరియడ్స్ లో స్త్రీకి వచ్చే కడుపునొప్పి తగ్గిస్తుంది. తల్లికి పాలను పెంచు తుంది. కిడ్నీస్, స్ప్లీన్ ప్రోబ్లమ్స్, అతి మూత్ర వ్యాధి, పిల్లలు రాత్రులలో పక్కలను తడుపుట నుండి నివారిస్తుంది.

ఓం హ్రౌం ఖగాయ నమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -6

అష్టాంగ నమస్కారం
6 వ స్థితి - మూలాధార చక్రము

* గాలి పీలుస్తూ సాష్టాంగ నమస్కార స్థితిలోకి వచ్చిన తరవాత గాలిని వదలాలి. * శని గ్రహాన్ని నిర్మించే “విశ్వవ్యచ" అనే నీలి కిరణాలు మూలాధార చక్రానికి స్ప్లీన్ సెంటర్ నుండి వస్తున్నాయని భావన చేయాలి. ఇవే విశ్వవ్యచ కిరణాల ద్వారా 'శుక్ర గ్రహ' నిర్మాణం జరుగుతుంది. తేడా ఏమిటంటే, శుక్రుడు వీర్యానికి అధిష్ఠాత అయి ఉత్పత్తికి కారణమయితే, 'శని' మృత్యుదేవత. ఈ విధంగా సూర్యుని యొక్క ‘విశ్వవ్యచ' కిరణాల ద్వారా ‘జన్మ -మృత్యు నియంత్రణ జరుగుతున్నది. ఈ 'విశ్వవ్యచ' కిరణా లను సేవించేవారు పూర్ణ ఆయుర్దాయాన్ని పొందుతారు. ఈ సాధన చేస్తున్నంత సేపూ 'కుజ' గ్రహ నిర్మాణానికి కారణమైన లేత ఎరుపు + ఊదా రంగు కిరణాలు సహస్రార చక్రము ద్వారా శరీరములోని రక్త దోషాలను తీసివేస్తూ ఆరోగ్యం, ఓజస్సు, తేజస్సును ప్రదానం చేస్తున్న భావన చెయ్యాలి.
ఓం హ్ర: పూష్ణే నమః అనే మంత్రోచ్చారణ చేయాలి. మూలాధారానికి 3 అంగుళాల దిగువన రాహు గ్రహాన్ని భావనచేస్తూ పైకి వస్తూ ఈ దిగువన తెలియ జేసిన చక్రాల వద్ద ఆయా లక్షణాలను భావన చెయ్యాలి.

మూలాధారం - సమయ సంయమనం,
స్వాధిష్టానం - ఇంద్రియ సంయమనం ,
మణిపూరకం - వాక్ సంయమనం,
అనాహతం - అర్థ సంయమనం,
విశుద్ధి - ఇంగితజ్ఞాను,
ఆజా - త్రికరణశుద్ధి,
సహస్రారము -బాధ్యత,
కేతుగ్రహ స్థానం - ధైర్యము,
కేతు గ్రహ స్థానం సహస్రారానికి 3 అంగుళాల పైన ఉంటుంది. కేతుగ్రహ స్థానము నుండి మరల దిగువకు మూలాధారం వరకు వస్తూ పైన తెలియజేసిన విధంగా ఆయా చక్రాల వద్ద ఆ లక్షణాలను భావన చెయ్యాలి.
సూర్యనమస్కారము -7

భుజంగాసనం
7వ స్థితి - మూలాధార చక్రము

* గాలి పీలుస్తూ శిరస్సు నుండి నాభి వరకు శరీరాన్ని వెనక్కు వంచుతూ భుజంగాసనం స్థితికి రావాలి. * స్ప్లీన్ నుంచి వస్తోన్న “విశ్వవ్యచా” కిరణాలను మూలా ధారం వద్ద భావన చేయాలి.

ఓం హ్రమ్ హిరణ్యగర్భాయ నమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -8

పర్వతాసనం
8వ స్థితి- స్వాధిష్టాన చక్రము

* గాలి వదుల్తూ నడుము పైకెత్తుతూ, తలను ముందుకు దించుతూ నాభిదర్శనం స్థితికి రావాలి. * స్ప్లీన్ నుండి "సుషుమ్న - సురాదన” కిరణాలు స్వాధిష్టానంలోకి చేరుతున్న భావన చేయాలి.

ఓం హ్రీం మరీచయేనమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -9

అశ్వ సంచలనాసనం
9వ స్థితి- మణిపూరక చక్రము

* గాలి పీలుస్తూ కుడి కాలును రెండు చేతుల మధ్యకు ముందుకు తీసుకు రావాలి. * స్ప్లీన్ నుంచి "విశ్వకర్మ" కిరణాలు మణిపూరకం లోకి చేరుతున్న భావన చేయాలి.

ఓం హ్రూం ఆదిత్యాయ నమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -10

పాదహస్తాసనం
10వ స్థితి- అనాహత చక్రము

* గాలి వదుల్తూ ఎడమకాలును కుడికాలు వద్దకు తీసుకొచ్చి పాదహస్తాసనం స్థితిలోకి రావాలి. * స్ప్లీన్ నుంచి తెల్లని సూర్య కిరణాలు అనాహతం లోకి చేరుతున్నట్లు, వీటి వల్ల సమస్త విశ్వానికి ప్రాణ శక్తి లభిస్తున్నదని భావన చెయ్యాలి.

ఓం హ్రైం సవిత్రే నమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -11

హస్త ఉత్థానాసనం
11వ స్థితి- విశుద్ధి చక్రము

* గాలి పీలుస్తూ చేతుల్ని పైకెత్తుతూ వెనక్కి వంగాలి. * స్ప్లీన్ నుంచి "విశ్వవ్యచ” కిరణాలు విశుద్ధి చక్రం లోకి చేరుతున్న భావన చేయాలి.

ఓం హ్రౌం అర్కాయనమ: అనే మంత్రోచ్చారణ చేయాలి.
సూర్యనమస్కారము -12

ప్రణామాసనం
12వ స్థితి- ఆజ్ఞా చక్రము

* గాలి వదుల్తూ చేతుల్ని నమస్కారముద్రలోకి తీసుకొస్తూ 1 వ స్థితిలోకి రావాలి. * స్ప్లీన్ నుంచి “ఉదావసు” కిరణాలు ఆజ్ఞాచక్రం లోకి ప్రవేశిస్తున్న భావన చేయాలి.

ఓం హ్ర: భాస్కరాయ నమః అనే మంత్రోచ్చారణ చేయాలి.
ఈ విధంగా సూర్య నమస్కారాల ప్రక్రియలోని ఒక ఆవర్తన పూర్తి అవుతుంది.